పర్వేద 8వ వార్డులో అద్భుతంగా నిమర్జనం వేడుకలుకలు
- పర్వేద 8వ వార్డులో అద్భుతంగా నిమర్జనం వేడుకలుకలు - September 22, 2026
- కుంచి మూట - September 17, 2026
పర్వేద 8వ వార్డులో వైభవంగా గణేష్ నిమజ్జన వేడుకలు
శంకర్ పల్లి (విలేకరి):
రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం పర్వేద గ్రామం 8వ వార్డులో గణేష్ నిమజ్జన వేడుకలు అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధల నడుమ ఘనంగా జరిగాయి. వార్డులోని సింగం యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తులు భక్తిపాటలు, డప్పు వాయిద్యాల నడుమ వేడుకలను అత్యంత అద్భుతంగా నిర్వహించారు.
ఈ వేడుకల్లో భాగంగా నిర్వహించిన మొదటి లడ్డు వేలం పాట తీవ్ర ఉత్కంఠ నడుమ సాగింది. గ్రామానికి చెందిన బి.రాజు రూ. 53,000 లకి లడ్డును వేలంలో దక్కించుకున్నారు.
అనంతరం యూత్ సభ్యులు, భక్తులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొని సంతోషంగా నృత్యాలు చేస్తూ, జై గణేషా నినాదాలతో గణపతి బప్పాను సాగనంపారు. కార్యక్రమంలో సింగం యూత్ సభ్యులు, వార్డు ప్రజలు, స్థానిక నాయకులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు.
