తలకొండపల్లి కేంద్రంగా కొత్త నియోజకవర్గం ఏర్పాటు చేయాలన డిమాండ్
- తలకొండపల్లి కేంద్రంగా కొత్త నియోజకవర్గం ఏర్పాటు చేయాలన డిమాండ్ - September 22, 2026
- అత్యవసర రక్త దానానికి 10 నిమిషాల్లోనే స్పందన - September 22, 2026
- మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డిని పరామర్శించిన డాక్టర్ విజితా రెడ్డి - September 22, 2026

తలకొండపల్లి సెప్టెంబర్ 21:రంగారెడ్డి జిల్లాలో నియోజకవర్గాల పునర్విభజన జరిగితే తలకొండపల్లి కేంద్రంగా కొత్త నియోజకవర్గాన్ని ఏర్పాటు చేయాలని స్థానికుల నుంచి డిమాండ్ వినిపిస్తోంది. ఈ మేరకు ప్రతిపాదనకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ప్రతిపాదిత నియోజకవర్గంలో తలకొండపల్లి, ఆమనగల్, కడ్తాల్, కేశంపేట మండలాలను కలపాలనే ఆలోచన ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఈ మండలాలు వేర్వేరు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఉన్నాయి.కల్వకుర్తి, షాద్‌నగర్ నియోజకవర్గాల పరిధి విస్తారంగా ఉండటంతో ప్రజలు తమ సమస్యలను ఎమ్మెల్యేల దృష్టికి తీసుకెళ్లేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానికులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో తలకొండపల్లిని కేంద్రంగా చేసుకుని కొత్త నియోజకవర్గం ఏర్పాటు చేస్తే పరిపాలన ప్రజలకు మరింత చేరువ కావడంతో పాటు ప్రాంతీయ అభివృద్ధికి ఊతం లభిస్తుందని వారు అభిప్రాయపడుతున్నారు.తలకొండపల్లి కేంద్రంగా నాలుగు మండలాలను కలిపి ప్రత్యేక నియోజకవర్గం ఏర్పాటు చేయాలనే డిమాండ్‌పై ప్రభుత్వం అధికారికంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉందని స్థానికులు పేర్కొంటున్నారు.
