గణేష్ మండపం వద్ద ఇరుముడి సినిమా ఉచిత ప్రదర్శన

వెల్దండ: మండల కేంద్రంలోని చత్రపతి శివాజీ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ మండపం వద్ద సెప్టెంబర్ 21 సోమవారం సాయంత్రం 7:30 గంటలకు ‘ఇరుముడి’ సినిమా ఉచిత ప్రదర్శన నిర్వహించనున్నారు. 10వ వార్డు సభ్యుడు మసిగుండ్ల వెంకటేష్ తన సొంత ఖర్చులతో ఈ ప్రదర్శనను ఏర్పాటు చేస్తున్నారు. తండ్రి–బిడ్డల సెంటిమెంట్‌తో పాటు అయ్యప్ప భక్తి భావనతో తెరకెక్కిన ఈ సినిమా తనను ఎంతగానో ఆకట్టుకుందని, అందుకే గ్రామ ప్రజలందరూ వీక్షించేలా ఉచితంగా ప్రదర్శించేందుకు ముందుకు వచ్చినట్లు వెంకటేష్ తెలిపారు. గ్రామ ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సినిమాను వీక్షించాలని కోరారు.1001198334.png

You may also like...