ధళిత – ఆదివాసి హక్కుల కోసం దేశ వ్యాప్త ఉద్యమం.. ఎంపీ మల్లు రవి
- రైతులకు నాణ్యమైన విత్తనాలను అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం – పల్లి పంపిణీకి ఏర్పాటు - September 21, 2026
- ధళిత – ఆదివాసి హక్కుల కోసం దేశ వ్యాప్త ఉద్యమం.. ఎంపీ మల్లు రవి - September 21, 2026
- రోడ్డు ప్రమాదంలో గోలి గోపాల్ రెడ్డి మృతి - September 20, 2026
నాగర్ కర్నూల్ : దళిత–ఆదివాసీల ఆత్మగౌరవం, రాజ్యాంగ హక్కులు, సామాజిక సమానత్వం కోసం జాతీయ స్థాయిలో ఉద్యమాన్ని చేపట్టనున్నట్లు నాగర్కర్నూల్ ఎంపీ, తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల ఫోరం కన్వీనర్, టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ డా. మల్లు రవి తెలిపారు. హల్ద్వానీలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రసంగించిన వేదికను ‘శుద్ధీకరణ’ పేరుతో శుద్ధి చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఇది దళిత–ఆదివాసీ సమాజాల ఆత్మగౌరవాన్ని అవమానించే చర్యగా అభివర్ణించారు.ఈ ఘటనపై జవాబుదారీతనం కోరిన రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్ నమోదు, ఎస్సీ/ఎస్టీ ఎంపీలు రాష్ట్రపతిని కలిసేందుకు ప్రయత్నించడం, జీరో ఎఫ్ఐఆర్ కోసం పోలీసులను ఆశ్రయించడం వంటి పరిణామాలపై డా. మల్లు రవి ఆందోళన వ్యక్తం చేశారు.సెప్టెంబర్ 29న న్యూఢిల్లీలోని మావలంకర్ హాల్లో ‘దళిత–ఆదివాసీ ఆత్మగౌరవ సమావేశం’ నిర్వహించనున్నట్లు తెలిపారు. అస్పృశ్యత, కుల వివక్షకు వ్యతిరేకంగా జాతీయ స్థాయి కార్యాచరణ రూపొందించడంతో పాటు, రాజ్యాంగ హక్కులు, మానవ గౌరవం, సామాజిక సమానత్వం కోసం తదుపరి కార్యాచరణను నిర్ణయిస్తామని వెల్లడించారు.అవమానానికి మౌనం కాదు ఆత్మగౌరవంతో సమాధానం వివక్షకు తలవంచం సమానత్వం కోసం పోరాడుతాం అని డా. మల్లు రవి పేర్కొన్నారు.
