రైతులకు నాణ్యమైన విత్తనాలను అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం – పల్లి పంపిణీకి ఏర్పాటు

వెల్దండ/కల్వకుర్తి, సెప్టెంబర్ 20: కల్వకుర్తి శాసనసభ్యులు కసిరెడ్డి నారాయణ రెడ్డి చేతుల మీదుగా సెప్టెంబర్ 21న వేరుశనగ విత్తనాల పంపిణీ కార్యక్రమం నిర్వహించనున్నారు.ఉదయం 10:30 గంటలకు వెల్దండ మండల కేంద్రంలోని రైతు వేదికలో, 11:30 గంటలకు కల్వకుర్తి పట్టణంలోని రైతు వేదికలలో ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సమక్షంలో విత్తనాల పంపిణీ జరుగుతుందని వెల్దండ మండల పార్టీ అధ్యక్షులు హరి కిషన్ నాయక్, కల్వకుర్తి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తెలిపారు.సంబంధిత మండల ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు తప్పక హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు కోరారు.1001197273.jpg

You may also like...