భార్య తల నరికిన నిందితుడి దారుణ అంతం
- హయత్‌నగర్ సమీపంలో ఘోర ప్రమాదం - September 15, 2026
- సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో విమోచన దినోత్సవ ఏర్పాట్ల పరిశీలన - September 15, 2026
- తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ప్రిన్స్ రహీమ్ అగా ఖాన్-Vతో సీఎం భేటీ - September 15, 2026

అస్సాంలో భార్యను అత్యంత కిరాతకంగా హత్య చేసిన కేసులో నిందితుడిగా ఉన్న రామానుజ్ గోస్వామి (28) పోలీసు కస్టడీలోనే మృతి చెందాడు. వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలిస్తుండగా కదులుతున్న పోలీసు వాహనం నుంచి దూకడంతో తీవ్ర గాయాలపాలై ప్రాణాలు కోల్పోయాడు. సోమవారం తెల్లవారుజామున గువాహటిలో ఈ ఘటన కలకలం రేపింది.
ఏడు రోజుల కస్టడీ ముగియడంతో వైద్య పరీక్షల నిమిత్తం తెల్లవారుజామున 2 గంటలకు హాటిగావ్ పోలీస్ స్టేషన్ నుంచి గౌహతి మెడికల్ కాలేజ్ ఆసుపత్రికి అతడిని తరలిస్తున్నారు. నరకాసుర పహార్ వద్ద పోలీసు వాహనం టైరు పంక్చర్ కావడంతో వాహనం ఆగింది. టైరు మార్చిన అనంతరం వాహనం కదులుతుండగా రామానుజ్ తన పక్కనే ఉన్న కానిస్టేబుల్‌ను కాలితో తన్ని, ఒక్కసారిగా వాహనం నుంచి దూకేశాడు.
రోడ్డుపై పడిన అతడు పక్కనే ఉన్న లోయలోకి జారిపడి తలకు తీవ్ర గాయాలపాలయ్యాడు. పోలీసులు ఆసుపత్రికి తరలించినా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అతడి శరీరంపై బుల్లెట్ గాయాలు లేవని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఘటనలో ఓ కానిస్టేబుల్‌కు స్వల్ప గాయాలయ్యాయి.
ఈ నెల 3న తన భార్య రియా తాలుక్దార్ (25) వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానంతో రామానుజ్ ఆమెను గొడ్డలితో దారుణంగా హత్య చేశాడు. అనంతరం ఆమె తలను నరికి పాలిథిన్‌లో చుట్టి ఫ్రిజ్‌లో దాచినట్లు పోలీసులు తెలిపారు. సెప్టెంబర్ 6న పోలీసుల ఎదుట లొంగిపోయాడు. కస్టడీ నుంచి తప్పించుకునే ప్రయత్నంలోనే దూకాడా? లేక ఆత్మహత్యకు పాల్పడ్డాడా? అనే రెండు కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
