ఆర్య వైశ్యులకు అండగా నిలిచిన సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు – బచ్చు రామకృష్ణ
- ఎంపీ ఆర్ కృష్ణయ్య కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఆంజనేయులు గౌడ్ - September 14, 2026
- ఎమ్మెల్యే సహకారంతో బొల్లంపల్లిలో విద్యుత్ ప్రమాద ముప్పు తొలగింపు - September 14, 2026
- సీఎంఆర్ఎఫ్ నిరుపేదలకు వరం – మార్కెట్ డైరెక్టర్ రాజశేఖర్ - September 14, 2026
వెల్దండ : పేద ఆర్యవైశ్యుల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం అండగా నిలిచినందుకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డికి నాగర్ కర్నూల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ జిల్లా అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బచ్చు రామకృష్ణ కృతజ్ఞతలు తెలియజేశారు.వెల్దండ మండల కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నిరుపేద ఆర్యవైశ్యులకు కొండంత అండగా ప్రజా ప్రభుత్వం నిలబడిందన్నారు. ఉప్పల్ భగాయత్ లో ఆర్యవైశ్య ఆత్మగౌరవ భవన నిర్మాణ పనులను శరవేగంగా పూర్తి చేయాలని కోరారు. ఆర్యవైశ్యులు విశ్వాసానికి బ్రాండ్ అంబాసిడర్లు అని సీఎం కొనియాడటం ఆర్యవైశ్య సమాజానికే గర్వకారణమని అన్నారు.
