బొల్లంపల్లి పోచమ్మ ఆలయ గోపురం నిర్మాణానికి సర్పంచ్ ప్రసాద్ గౌడ్ విరాళం
- తర్నికల్ తండాలో ఉప్పల ట్రస్టు ఉదారత గాయపడిన యువకుడికి రూ.25 వేల ఆర్థిక సాయం - September 11, 2026
- కన్నీటి వేళ.. అండగా నిలిచిన ఉప్పల ట్రస్ట్ - September 11, 2026
- బొల్లంపల్లి పోచమ్మ ఆలయ గోపురం నిర్మాణానికి సర్పంచ్ ప్రసాద్ గౌడ్ విరాళం - September 11, 2026
కల్వకుర్తి సెప్టెంబర్ 11: వెల్దండ మండలంలోని బొల్లంపల్లి గ్రామంలోని పోచమ్మ ఆలయ నిర్మాణ అభివృద్ధి పనులకు గ్రామ సర్పంచ్ సత్తూరి ప్రసాద్ గౌడ్ తన వంతు సహకారం అందించారు.ఆలయ నిర్మాణ పనులలో భాగంగా గోపుర నిర్మాణమునకు శుక్రవారం గోపుర నిర్మాణ శిల్పికి రూ.20,000 రూపాయలు విరాళంగా అందజేశారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ వెంకటరెడ్డి,ఉప సర్పంచ్ రామకృష్ణ,నాయకులు కానుగుల పర్వతాలు, రమేష్, యాదయ్య, బ్రహ్మచారి, అలంపల్లి కృష్ణ, శ్రీనివాస్ చారి, మాజీ వార్డు సభ్యులు పర్వతాలు,బూర్గు లింగం యాదవ్, చొప్పరి శంకరయ్య, ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
