పోతేపల్లి ప్రభుత్వ పాఠశాలలో దుస్తులు పంపిణీ :

వెల్దండ మండలంలోని పోతేపల్లి ప్రభుత్వ పాఠశాలలో గ్రామ సర్పంచ్ ప్రభుత్వ దుస్తుల పంపిణీ కార్యక్రమంలో పాల్గోని స్వయంగా తన చేతులు మీదుగా దుస్తులు విద్యార్థులకు పంచడం జరిగింది. సర్పంచ్ గారు మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన విద్యను ప్రభుత్వ పాఠశాలలు అందిస్తున్నాయి, ప్రైవేటు పాఠశాలలు ఎప్పటికీ ప్రత్యామ్నాయం కాలేదని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం కోసం తమ వంతు కృషి చేస్తామని తేలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు వార్డు సభ్యులు నేతలు గోరేటి అశోక్ కుమార్ , ఎగిరి శెట్టి శివ , మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

You may also like...