రాష్ట్రపతి నిలయంలో సత్తా చాటిన వెల్దండ ఏకలవ్య విద్యార్థులు
- నిరుద్యోగులకు శుభవార్త – సుంకిరెడ్డి జాబ్ డ్రైవ్ కు భారీ స్పందన.! - September 10, 2026
- పర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతి శ్రేయస్కరం – మున్సిపాలిటీ చైర్మన్ సత్య నాయక్ - September 10, 2026
- కరెంటు కోతలతో రైతన్న ఆగ్రహం – తాండ్ర గేట్ హైవే బ్లాక్.! - September 10, 2026
వెల్దండ సెప్టెంబర్ 09: వెల్దండ మండలంలోని గుండాల గ్రామంలో గల ఏకలవ్య ఆదర్శ గురుకుల పాఠశాల విద్యార్థులు జాతీయ వేదికపై మరోసారి సత్తా చాటారు. సికింద్రాబాద్లోని రాష్ట్రపతి నిలయంలో నిర్వహించిన జాతీయ స్థాయి సాంస్కృతిక పోటీలలో హిందీ గేయం, తెలుగు జానపద గేయం విభాగాల్లో ప్రథమ బహుమతి సాధించి వరుసగా రెండోసారి విజేతలుగా నిలిచారు. విజేతలకు వేదికపై బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ విజయం పాఠశాలకు, మండలానికి గర్వకారణమని ప్రిన్సిపల్ సుమన్ కుమార్, వైస్ ప్రిన్సిపల్ కోడం భాస్కర్ తెలిపారు. విద్యార్థుల ప్రతిభకు ఇది నిదర్శనమని, శిక్షణ ఇచ్చిన ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు ధన్యవాదాలని వారు పేర్కొన్నారు. విజేతలను మండల విద్యాశాఖ అధికారులు, గ్రామ పెద్దలు అభినందించారు.
