ఈ నెల 10,11న మండల స్థాయి ఎస్ జీఎఫ్ క్రీడలు : ఎంఈఓ అంజయ్య
- ఈ నెల 10,11న మండల స్థాయి ఎస్ జీఎఫ్ క్రీడలు : ఎంఈఓ అంజయ్య - September 10, 2026
- సీపీఎం సీనియర్ నాయకుడు మృతి - September 10, 2026
- రేవంత్ రెడ్డి పాలనలో శాంతిభద్రతలు విఫలం: కేసీఆర్ ఇంటి ముట్టడికి పోలీసులే రూట్‌మ్యాప్ ఇవ్వడం దారుణం.. సీఎం ప్రజలకు క్షమాపణ చెప్పాలి నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య - September 10, 2026
కట్టంగూర్: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్ జీఎఫ్) ఆధ్వర్యంలో మండల స్థాయి పాఠశాలల క్రీడా పోటీలు ఈ నెల 10,11తేదీల్లో కట్టంగూర్ ఉన్నత పాఠశాలలో నిర్వహించనున్నట్లు మండల విద్యాధికారి అంబటి అంజయ్య తెలిపారు. బుధవారం కట్టంగూర్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అండర్-14-17 విభాగాల్లో బాలబాలికలకు కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అండర్14 విభాగంలో పాల్గొనే విద్యార్థులు1-1-2013 తరువాత, అండర్-17 విభాగంలో పాల్గొనే వారు 1-1-2010తరువాత జన్మించి ఉండాలని తెలిపారు. మడంలంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలతో పాటు కేజీబీవీ. ఆశ్రమ, గురుకుల పాఠశాలల విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొనవచ్చని పేర్కొన్నారు. సమావేశంలో ఎస్ఎఫ్ నకిరేకల్ నియోజకవర్గ కన్వీనర్ వ్యాయామ ఉపాధ్యాయులు రాజ శేఖర్‌రెడ్డి, మండల కన్వీనర్ శ్రీనివాస్, మాణిక్యం, చింతకాయల పుల్లయ్య, జగదీష్, సైదులు, పవన్ పాల్గొన్నారు.

