స్పీకర్ కు సంఘీభావం తెలిపిన..ఎమ్మెల్యే కసిరెడ్డి
- నిరుద్యోగులకు శుభవార్త – సుంకిరెడ్డి జాబ్ డ్రైవ్ కు భారీ స్పందన.! - September 10, 2026
- పర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతి శ్రేయస్కరం – మున్సిపాలిటీ చైర్మన్ సత్య నాయక్ - September 10, 2026
- కరెంటు కోతలతో రైతన్న ఆగ్రహం – తాండ్ర గేట్ హైవే బ్లాక్.! - September 10, 2026
కల్వకుర్తి సెప్టెంబర్ 09 :కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లు రవితో కలిసి బుధవారం అసెంబ్లీలో రాష్ట్ర అసెంబ్లీ వ్యవహారాల ఇన్‌చార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ లను మర్యాదపూర్వకంగా కలిశారు.ఇటీవల శాసనమండలి సభ్యుడు తాతా మధు స్పీకర్ పట్ల చేసిన అనుచిత వ్యాఖ్యలు, ప్రవర్తనపై ఎమ్మెల్యే తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ స్పీకర్ కు సంఘీభావం తెలిపారు.మంత్రి శ్రీధర్ బాబును కలిసి భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకొని శాసనసభ గౌరవ ప్రతిష్ఠలను కాపాడాలని కోరారు. శాసనసభ ప్రజాస్వామ్యానికి ప్రతీక అని, సభా మర్యాదలను ప్రతి ఒక్కరూ పాటించాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
