దేవాలయాలు ఆధ్యాత్మిక విశ్వాసానికి ప్రతీక.. సుంకి రెడ్డి

కల్వకుర్తి సెప్టెంబర్ 07: తలకొండపల్లి మండలం,దేవుని పడకల్ మరియు పడకల్ గ్రామాల్లో శ్రీ పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో

మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ తో కలిసి ఐక్యత ఫౌండేషన్ చైర్మన్,కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు టాస్క్ సిఓఓ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం దేవుని పడకల్ గ్రామంలోని శ్రీ పోచమ్మ తల్లి ఆలయ అభివృద్ధి కోసం రూ.2,30,000/-రెండు లక్షల ముప్పై వేల రూపాయలు విరాళం అందించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లోని ఆలయాలు ప్రజల ఆధ్యాత్మిక విశ్వాసాలకు, సంప్రదాయాలకు ప్రతీకలుగా నిలుస్తాయన్నారు.శ్రీ పోచమ్మ తల్లి అమ్మవారి ఆశీస్సులతో రెండు గ్రామాల ప్రజలు సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, దేవుని పడకల్ మరియు పడకల్ గ్రామాలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారు.ఈ కార్యక్రమాల్లో

సర్పంచ్‌లు సునీత డోకూరి ప్రభాకర్ రెడ్డి, కానుగుల అనిత మల్లేష్, ఉప సర్పంచ్ అంబటి వెంకటేశ్, మాజీ సర్పంచ్ కుమ్మరి శంకర్, వార్డు సభ్యులు స్వామి గౌడ్, సీనియర్ నాయకులు తిరుపతి గౌడ్, ఆలయ కమిటీ సభ్యులు కృష్ణయ్య, నరసింహ లతో పాటు గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, యువత, మహిళలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

You may also like...