అక్రమ అరెస్టులతో ధర్మపోరాటాన్ని ఆపలేరు.. బీజేవైఎం
- బాధిత కుటుంబానికి నాగర్ కర్నూల్ డీసీసీ కార్యదర్శి పరామర్శ - September 7, 2026
- కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి కుటుంబానికి బాకీలు చెల్లించాలని బీఆర్ఎస్ ప్రజావాణిలో ఫిర్యాదు - September 7, 2026
- అక్రమ అరెస్టులతో ధర్మపోరాటాన్ని ఆపలేరు.. బీజేవైఎం - September 7, 2026
*అక్రమ అరెస్టులతో ధర్మ పోరాటాన్ని ఆపలేరు..బీజేవైఎమ్*
కల్వకుర్తి సెప్టెంబర్ 07: పేద విద్యార్థులకు రావలసిన ఫీజు రీఎంబర్స్మెంట్, స్కాలర్షిప్స్ ఇవ్వాలని శాంతియుతంగా ధర్నాలో పాల్గొనడానికి వెళ్తున్న బీజేవైఎం, బిజెపి నాయకులను తలకొండపల్లి పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా బీజేవైఎం కల్వకుర్తి అసెంబ్లీ కన్వీనర్ పద్మ అనిల్ ముదిరాజ్ మాట్లాడుతూ..ఎన్ని అడ్డంకులు వచ్చిన తెలంగాణ విద్యార్థుల పక్షాన బిజెపి, బీజేవైఎం పోరాడుతుందని, ఫీజుల బకాయిలు చెల్లించే వరకు కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచైనా సరే ఈ విద్యార్థులకు రావాల్సిన బకాయిలను చెల్లించే వరకు వదిలేది లేదని హెచ్చరించారు.అక్రమ అరెస్టు అయినవారిలో బీజేపీ నాయకులు పద్మ అనిల్ ముదిరాజ్, పోతుగంటి మహేష్ ఈసారి శ్రీకాంత్ ముదిరాజ్ పద్మ గణేష్ ముదిరాజ్ ఉన్నారు.
