డ్రైవింగ్ లైసెన్స్‌కు పాయింట్ల విధానం
- లాటరీ గెలిచినా.. తనిఖీలో తేలాల్సిందే - September 5, 2026
- డ్రైవింగ్ లైసెన్స్‌కు పాయింట్ల విధానం - September 5, 2026
- తెలంగాణ ప్రజలను నట్టేట ముంచిన కాంగ్రెస్ ప్రభుత్వం - September 4, 2026

ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలకు అడ్డుకట్ట వేసేందుకు డ్రైవింగ్ లైసెన్స్‌లకు పాయింట్ల విధానం తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఈ ప్రతిపాదనను వెల్లడించారు. ఓవర్‌స్పీడింగ్, రెడ్‌లైట్ జంపింగ్, రాంగ్ రూట్ వంటి ఉల్లంఘనలకు నెగటివ్ పాయింట్లు కేటాయిస్తారు. నిర్దేశిత పరిమితికి మించి పాయింట్లు కోల్పోతే లైసెన్స్‌ను సస్పెండ్ లేదా రద్దు చేసే అవకాశం ఉంటుంది. మరోవైపు నిబంధనలు పాటిస్తూ బాధ్యతగా వాహనం నడిపేవారికి గుడ్ పాయింట్లు ఇచ్చి, ఇన్సూరెన్స్ ప్రీమియంలో రాయితీలు, ఇతర ప్రయోజనాలు కల్పించనున్నారు. దేశంలో ఏటా సుమారు 5 లక్షల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో రోడ్డు భద్రతను పెంచడమే లక్ష్యమని గడ్కరీ తెలిపారు. ప్రస్తుతం ఈ విధానం ప్రతిపాదన దశలోనే ఉంది.
