తెలంగాణ ప్రజలను నట్టేట ముంచిన కాంగ్రెస్ ప్రభుత్వం
- తెలంగాణ ప్రజలను నట్టేట ముంచిన కాంగ్రెస్ ప్రభుత్వం - September 4, 2026
- యూత్ డిక్లరేషన్ ర్యాలీని జయప్రదం చేయండి.. గోలి - September 4, 2026
- ధ్వజస్తంభ ప్రతిష్ఠాపనకు టాస్క్ సిఓఓ రూ. లక్ష విరాళం - September 4, 2026

కల్వకుర్తి సెప్టెంబర్ 04: రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండల కేంద్రంలో శుక్రవారం మూడో రోజు వంటావార్పు కార్యక్రమం మండల బీఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో కార్యక్రమంలో నిర్వహించారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల మాజీ చైర్ పర్సన్ రజిని,మాజీ జెడ్పిటీసిలు డాక్టర్ విజితా రెడ్డి, జర్పుల దశరథ నాయక్, మరియు కడ్తాల్ మండల పార్టీ అధ్యక్షులు పాల్గొని మాట్లాడారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ 420 ప్రజలకు ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేయడంలో విఫలమైందని ఆరోపించారు. ఆరు గ్యారెంటీలను పూర్తిస్థాయిలో అమలు చేయకుండా ప్రజలను ప్రభుత్వం మోసం చేస్తోందని విమర్శించారు.వెయ్యి రోజుల పాలనలో ఇచ్చిన హామీల అమలుపై ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మండల పార్టీ నాయకులు, ఎస్సీ సెల్, ఎస్టీ సెల్ వివిధ విభాగాల నాయకులు,బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు, స్థానికులు పాల్గొన్నారు.
