సప్త గిరులపై భాసిల్లుశ్రీ వెంకటేశ

సప్త గిరులపై భాసిల్లు శ్రీ వెంకటేశ,
సప్త స్వరముల నిన్నర్చింతు శ్రీ శ్రీనివాస,
స స, రి రి, గ గ, మ మ,
ప ప,ద ద, ని ని….

సప్తా శ్వములపై అరుదెంచి సూరీడు,
సంసిద్దుడై ఉన్నాడు ఉదయాద్రిపై,
సంతుష్టుడై నీ సేవలో తరించిన శశి,
సెలవు కోరుతున్నాడు అలసి సొలసి..

అక్షితలై భాసిల్లు ఆ నక్షత్ర మండలి,
అలుపు తీరగాను కను మరుగవసాగే,
పావన జలములెల్ల నీ పద సేవకై,
తహ తహ లాడు చున్నవి నీ అనుమతికై…

మేలుకోవయ్య ఇక కలత నిద్దుర నుంచి,
మమ్మేలు కోవయ్య మా కడగండ్లు బాపి…


చెరుకుపల్లి గాంగేయ శాస్త్రి, రాజమండ్రి

You may also like...