పారిశుద్ధ కార్మికున్ని పరామర్శించిన బీజేపీ మండల అధ్యక్షులు బుర్ర వెంకటేష్ గౌడ్,వివిధ పార్టీల నాయకులు

జ్ఞాన తెలంగాణ, చిట్యాల, జనవరి 16:
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల గ్రామ పంచాయతీ సిబ్బంది సరిగొమ్ముల మొగిలి గత వారం రోజుల క్రితం ప్రమాదవశాతు రోడ్డు ప్రమాదం జరుగగా తలకి తీవ్ర గాయం కాగా చికిత్స అనంతరం ఇంటికి వచ్చిన మొగిలిని శుక్రవారం రోజున పరామర్శించారు.బిజెపి చిట్యాల మండల అధ్యక్షుడు (చిట్యాల ఉపసర్పంచ్ )బుర్ర వెంకటేష్ గౌడ్ వారితో పాటు వివిధ పార్టీల నాయకులు సైతం మొగిలి ని కలిసి వారి ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు ఈ కార్యక్రమం లో ఇరుకులపాటి. పూర్ణచంద్రరావు, చేరి రవీందర్, ఏలేటి రాజు,కేంసరపు ప్రభాకర్,గుండ మణికుమార్ తదితరులు పాల్గొన్నారు.
