రేపు శంకర్‌పల్లిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు
- నిషేధిత భూమి రిజిస్ట్రేషన్.. సబ్ రిజిస్ట్రార్ అరెస్టు - September 6, 2026
- క్రిష్ణగిరి పాదాల గుట్టకు తిరిగి పూర్వ వైభవం - September 5, 2026
- శంకర్‌పల్లి మున్సిపాలిటీలో జోరు అందుకున్న అండర్ డ్రైనేజీ పనులు - September 5, 2026

- రేపు ఎమ్మెల్యే కాలే యాదయ్య పర్యటన
జ్ఞాన తెలంగాణ,చేవెళ్ల ప్రతినిధి :
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గంలోని శంకర్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలో పలు కీలక అభివృద్ధి కార్యక్రమాలకు రేపు (13 జనవరి 2026) గౌరవ చేవెళ్ల శాసనసభ్యులు శ్రీ కాలే యాదయ్య గారు శంకుస్థాపనలు చేయనున్నారు. పట్టణ ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం మంజూరు చేసిన కోట్లాది రూపాయల నిధులతో ఈ అభివృద్ధి పనులు ప్రారంభం కానున్నాయి.
ఎమ్మెల్యే పర్యటనలో భాగంగా ఉదయం 9:15 గంటలకు రామంతపూర్ వార్డులో రూ.50 లక్షల వ్యయంతో వర్షపు డ్రైనేజీ మరియు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం ఉదయం 9:30 గంటలకు ఫతేపూర్ ఫ్లైఓవర్ వద్ద రూ.60 లక్షలతో చేపట్టనున్న వర్షపు మరియు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనుల ప్రారంభోత్సవంలో పాల్గొంటారు.
ఉదయం 9:45 గంటలకు ఇంద్రారెడ్డి సర్కిల్ నుంచి రైల్వే స్టేషన్ వరకు రూ.1 కోటి 20 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణానికి, రూ.35 లక్షలతో ఇంద్రారెడ్డి చౌరస్తా జంక్షన్ అభివృద్ధికి, అలాగే రూ.50 లక్షలతో ఎల్‌ఈడి వీధి దీపాల ఏర్పాటు పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఉదయం 10:15 గంటలకు గాయత్రి వెంచర్ పార్కులో రూ.40 లక్షలతో పార్కు అభివృద్ధి పనులు ప్రారంభిస్తారు.
అనంతరం ఉదయం 10:30 గంటలకు సింగపూర్ సర్కిల్ వద్ద రూ.60 లక్షలతో వర్షపు నీటి డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేస్తారు. ఉదయం 10:45 గంటలకు టీచర్స్ కాలనీ నుంచి పటాన్‌చెరు రోడ్డు వరకు రూ.1 కోటి 40 లక్షలతో సీసీ రోడ్డు, టీచర్స్ కాలనీలో రూ.40 లక్షలతో సీసీ రోడ్డు, భవాని నగర్‌లో రూ.30 లక్షలతో సీసీ రోడ్డు, ఆదర్శ్‌నగర్‌లో రూ.1 కోటి 20 లక్షలతో వర్షపు & అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, మంజీరా పైప్‌లైన్ రోడ్ వద్ద రూ.75 లక్షలతో బాక్స్ కల్వర్ట్, అలాగే మణి గార్డెన్ వరకు రూ.60 లక్షలతో వర్షపు డ్రైనేజీ పనులకు శంకుస్థాపనలు జరగనున్నాయి.
అనంతరం ఉదయం 11:00 గంటలకు సింగపూర్ టవర్ వద్ద రూ.40 లక్షలతో వర్షపు డ్రైనేజీ, ఉదయం 11:15 గంటలకు రాయల్ పామ్స్ అపార్ట్మెంట్ వెనుక రూ.50 లక్షలతో పార్కు అభివృద్ధి, ఉదయం 11:30 గంటలకు బుల్కాపూర్ వార్డులో రూ.80 లక్షలతో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేయనున్నారు.
ఈ కార్యక్రమాలకు ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, మీడియా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని ఎమ్మెల్యే కార్యాలయ వర్గాలు కోరాయి.
