శంకర్ పల్లి లో నూతన రుచుల ఆవిష్కరణ,MS Brothers రొట్టెల కేంద్రం

- శంకర్‌పల్లి వాసులకు కొత్త రుచుల చిరునామా – MS Brothers Roti’s & Curry’s
జ్ఞాన తెలంగాణ, శంకర్‌పల్లి:
శంకర్‌పల్లి పట్టణంలో కొత్తగా “MS Brothers Roti’s & Curry’s” పేరుతో ప్రత్యేక రొట్టెల వ్యాపారం ప్రారంభమైంది. నిర్వాహకులు నాని బుచ్చయ్య ఆధ్వర్యంలో ప్రారంభమైన ఈ కేంద్రంలో జొన్న రొట్టె (పచ్చవి – తెల్లవి), గోధుమ చపాతీలు, రుమాలు రొట్టె, వివిధ రకాల కూరలు, ప్రత్యేక పచ్చళ్ళు వంటి వంటకాలు పరిశుభ్రతతో అందుబాటులోకి వస్తున్నాయి.
ఆధునిక యంత్రాల సాయంతో తయారయ్యే ఈ రొట్టెలు రుచికరంగా ఉండటమే కాకుండా ఆరోగ్యకరంగా కూడా ఉంటాయి. శంకర్‌పల్లిలో ఆరోగ్యకరమైన ఆహారం కోరుకునే వారికి ఇది విశేష ఆకర్షణగా మారనుంది.
రొట్టెలు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా జొన్న రొట్టెలు మధుమేహ నియంత్రణలో సహాయపడతాయి. రక్తపోటు, కొలెస్ట్రాల్ తగ్గించడంలో మేలు చేస్తాయి. శరీరానికి తేలికగా జీర్ణమయ్యే ఈ రొట్టెలు శక్తి, పోషక విలువలు సమృద్ధిగా అందిస్తాయి. కడుపు నిండిన భావన కలిగించి బరువు నియంత్రణలో దోహదపడతాయి. అలాగే, ఫైబర్ అధికంగా ఉండటం వల్ల జీర్ణాశయ ఆరోగ్యాన్ని కాపాడుతాయి.
ఈ కొత్త సదుపాయం శంకర్‌పల్లి గ్యాస్ కార్యాలయం వెనుక, మాస్టర్ మైండ్స్ పాఠశాల పక్కన, నరసింహరెడ్డి వెంచర్‌లోని స్థల నం. 104 వద్ద అందుబాటులో ఉంది. పెద్ద మొత్తంలో ఆర్డర్లు కూడా స్వీకరించబడుతున్నాయి.
సంప్రదించండి: 98487 65337 / 78427 31307
“రుచికరమైన రొట్టెలు – ఆరోగ్యకరమైన జీవనం”


