లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన తాండూరు పురపాలక సీనియర్ అసిస్టెంటు
- నిషేధిత భూమి రిజిస్ట్రేషన్.. సబ్ రిజిస్ట్రార్ అరెస్టు - September 6, 2026
- క్రిష్ణగిరి పాదాల గుట్టకు తిరిగి పూర్వ వైభవం - September 5, 2026
- శంకర్పల్లి మున్సిపాలిటీలో జోరు అందుకున్న అండర్ డ్రైనేజీ పనులు - September 5, 2026

జ్ఞానతెలంగాణ,రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : తాండూరులో అవినీతి మరొకసారి వెలుగులోకి వచ్చింది. తాండూరు పురపాలక కార్యాలయంలో సీనియర్ అసిస్టెంటుగా పనిచేస్తున్న బి. రమేష్ అనే అధికారి లంచం తీసుకుంటూ తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులకు పట్టుబడ్డాడు.ఫిర్యాదుదారుడు తాను నిర్మించుకున్న ఒక షెడ్డుకు ఇంటి నంబర్ కేటాయించాలనగా, అందుకు ప్రతిగా ₹15,000 లంచం కోరిన రమేష్‌ను, డబ్బులు స్వీకరిస్తున్న సమయంలోనే ACB అధికారులు పట్టుకున్నారు.
