సింగపూర్ టవర్‌లో ప్రత్యేక ఎస్ఐఆర్ శిబిరం
- నిషేధిత భూమి రిజిస్ట్రేషన్.. సబ్ రిజిస్ట్రార్ అరెస్టు - September 6, 2026
- క్రిష్ణగిరి పాదాల గుట్టకు తిరిగి పూర్వ వైభవం - September 5, 2026
- శంకర్పల్లి మున్సిపాలిటీలో జోరు అందుకున్న అండర్ డ్రైనేజీ పనులు - September 5, 2026

సింగపూర్ టవర్‌లో ప్రత్యేక ఎస్ఐఆర్ శిబిరం
- కౌన్సిలర్ ఆనంద్‌రావు ఎర్ర పరిశీలన
- మూడు వార్డుల ప్రజలకు ప్రత్యేక సౌకర్యం
- డ్వాక్రా భవనంలో ప్రత్యేక శిబిరం
- అధికారుల సమన్వయంతో వేగవంతమైన సేవలు
- ఓటరు జాబితా సవరణలో ప్రజలు భాగస్వాములు కావాలి
జ్ఞాన తెలంగాణ,శంకర్పల్లి: ఎన్నికల సంఘం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) కార్యక్రమాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేయాలనే లక్ష్యంతో శంకర్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని సింగపూర్ టవర్‌లో ప్రత్యేక శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మొదటి వార్డు కౌన్సిలర్ ఆనంద్‌రావు ఎర్ర పాల్గొని శిబిరం నిర్వహణ తీరును పరిశీలించారు. సింగపూర్ టవర్‌లో నివసిస్తున్న 1, 9, 10 వార్డులకు చెందిన ఓటర్లు తమ ఓటరు నమోదు, వివరాల సవరణ, చిరునామా మార్పు, పేర్ల చేర్పు, తొలగింపు వంటి సేవలను ఒకే వేదికపై సులభంగా పొందేలా టవర్ నివాసుల విజ్ఞప్తి మేరకు డ్వాక్రా సంఘం భవనంలో ప్రత్యేకంగా ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ప్రజలకు ప్రభుత్వ సేవలను చేరువ చేయాలనే పరిపాలనా దృక్పథానికి ఇది నిదర్శనమని స్థానికులు అభిప్రాయపడ్డారు. శిబిరాన్ని సూపర్వైజర్ సంగీత ఆధ్వర్యంలో బీఎల్ఓ పద్మారావు, మున్సిపల్ సిబ్బంది బి. రామచందర్, శ్రీకాంత్, ప్రవల్లిక తదితరులు సమన్వయంతో క్రమబద్ధంగా నిర్వహిస్తున్నారు. ప్రతి దరఖాస్తును నిబంధనలకు అనుగుణంగా పరిశీలిస్తూ, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పారదర్శకంగా సేవలు అందిస్తున్నారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ ఆనంద్‌రావు ఎర్ర మాట్లాడుతూ, ఓటు హక్కు ప్రజాస్వామ్యానికి మూలస్తంభమని, ప్రతి అర్హులైన పౌరుడు తన ఓటరు వివరాలు సక్రమంగా నమోదై ఉన్నాయో లేదో తప్పనిసరిగా పరిశీలించుకోవాలని సూచించారు. ప్రభుత్వం, ఎన్నికల సంఘం కల్పించిన ఈ ప్రత్యేక అవకాశాన్ని నిర్లక్ష్యం చేయకుండా ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని, ప్రజల చైతన్యమే పారదర్శక ఎన్నికల వ్యవస్థకు బలమైన పునాదిగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు.కార్యక్రమంలో టవర్ పెద్దలు , యువకులు చాకలి శంకరయ్య , మంగలి మల్లేశం, టైలర్ శంకరన్న, రమేష్, సతీష్, కాళిదాస్, వాలెంటర్లుగా సహాయ సహకారాలు అందించడం జరిగింది.
