ప్రతిపక్ష పాత్రను బాధ్యతగా నిర్వహిద్దాం: పార్టీ నేతలకు కెటిఆర్ సూచన.
- నిషేధిత భూమి రిజిస్ట్రేషన్.. సబ్ రిజిస్ట్రార్ అరెస్టు - September 6, 2026
- క్రిష్ణగిరి పాదాల గుట్టకు తిరిగి పూర్వ వైభవం - September 5, 2026
- శంకర్పల్లి మున్సిపాలిటీలో జోరు అందుకున్న అండర్ డ్రైనేజీ పనులు - September 5, 2026

ప్రతిపక్ష పాత్రను బాధ్యతగా నిర్వహిద్దాం: పార్టీ నేతలకు కెటిఆర్ సూచన.
హైదరాబాద్ డిసెంబర్ 14:ప్రజలు ఇచ్చిన ప్రతిపక్ష బాధ్యతను విజయ వంతంగా నిర్వహిద్దామని ఎంఎల్‌ఎలు ఆ పార్టీ నేతలతో గురువారం నిర్వ హించిన సమావేశంలో కేటీఆర్ అన్నారు.రాష్ట్రంలో బిఆర్‌ఎస్ నాయ కత్వంపై సానుకూల స్పంద న వస్తోందని వెల్లడించారు పదేళ్లలో బిఆర్‌ఎస్ అనేక అద్భుతమైన కార్యక్రమాలు చేపట్టిందని గుర్తుచేశారు.
రాష్ట్ర ప్రజలు తమ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇచ్చారని ఆ బాధ్యతను నిర్వహి స్తామని ఆయన వెల్లడిం చారు.నాడు అధికారం ఇస్తే ఎంత బాధ్యతగా ఉన్నామో నేడు ఓడిన తర్వాత కూడా అంతే బాధ్యతగా ఉంటామని కెటిఆర్ తెలిపారు.ఈ ఎదురుదెబ్బను పాఠంగా నేర్చుకొని ఓటమికిగల కారణాలను లోతుగా విశ్లేషించుకుంటామని తెలిపారు.
అదేవిధంగా ఈ ఫలితాలపై నేతలు కార్య కర్తలు ఎటువంటి నిరాశ పడొద్దని, ఇది పార్టీకి తాత్కాలికి బ్రేక్ మాత్ర మేనని ధైర్యం చెప్పారు.ఈ అయిదేళ్లలో 100 శాతం ప్రజల పక్షాన ప్రజల గొంతుకై నిలుస్తామని మాజీ మంత్రి కెటిఆర్.
