రాజ్యాంగ రక్షణ కొరకే జస్టిస్ సుదర్శన్‌రెడ్డి ఎంపిక: రాహుల్
- నిషేధిత భూమి రిజిస్ట్రేషన్.. సబ్ రిజిస్ట్రార్ అరెస్టు - September 6, 2026
- క్రిష్ణగిరి పాదాల గుట్టకు తిరిగి పూర్వ వైభవం - September 5, 2026
- శంకర్పల్లి మున్సిపాలిటీలో జోరు అందుకున్న అండర్ డ్రైనేజీ పనులు - September 5, 2026

పరాష్ట్రపతి పదవికి జస్టిస్ సుదర్శన్‌రెడ్డిని అభ్యర్థిగా ఎంచుకోవడం రాజ్యాంగాన్ని రక్షించేందుకు జరుగుతున్న పోరాటమేనని కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ అన్నారు. జస్టిస్ సుదర్శన్‌రెడ్డి ఐదు దశాబ్దాలకుపైగా రాజ్యాంగాన్ని పరిరక్షిస్తున్నారని తెలిపారు.ఉపరాష్ట్రపతి పదవికి అభ్యర్థిగా ప్రతిపక్షాలు నిర్ణయించిన జస్టిస్ సుదర్శన్‌రెడ్డిని బుధవారం ఇండియా కూటమికి చెందిన ఎంపీలు పార్లమెంట్ సెంట్రల్ హాలులో సత్కరించారు. రాజ్యాంగ పరిరక్షణ బాఽధ్యత, రాజ్యాంగ విలువలపై సుదర్శన్‌రెడ్డి సుమారు అరగంట సేపు చేసిన ప్రసంగం సభ్యులను ఆకట్టుకుంది. కాగా ఆయన గురువారం ఉదయం 11 గంటలకు నామినేషన్ దాఖలు చేయనున్నారు.


