శంషాబాద్‌లో ఘనంగా పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమం
- శంషాబాద్‌లో ఘనంగా పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమం - November 5, 2026
- హైదరాబాద్ ప్రయాణికులకు శుభవార్త: మెట్రో, ఆర్టీసీ కామన్ పాస్ ధరలు భారీగా తగ్గింపు! - November 5, 2026
- కారు బీభత్సం: కాలీమందిర్ వద్ద ఆర్టీసీ కండక్టర్‌కు తీవ్ర గాయాలు, పలు వాహనాలు ధ్వంసం - November 2, 2026

రాజేంద్రనగర్: రాజేంద్రనగర్ నియోజకవర్గ పరిధిలో ఎమ్మెల్సీ (MCL) గ్రాడ్యుయేట్ ఓటరు నమోదు కార్యక్రమం ఉత్సాహంగా ప్రారంభమైంది. తెలంగాణ రక్షణ సేన పార్టీ స్థానిక నేత, టిఆర్ఎస్ (TRS) పార్టీ రాజేంద్రనగర్ నియోజకవర్గ ఇంచార్జ్ బృందం ఆధ్వర్యంలో నీరుడు సర్వేష్ ముదిరాజ్ ఈ ప్రత్యేక నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు.
అర్హులైన పట్టభద్రులందరికీ ఓటరు నమోదుపై అవగాహన కల్పిస్తూ, వారు ఈ ప్రక్రియలో పాల్గొనేలా నిర్వాహకులు ప్రోత్సహిస్తున్నారు. ఈ సందర్భంగా నీరుడు సర్వేష్ ముదిరాజ్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, ముఖ్యంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతి ఒక్క అర్హుడి భాగస్వామ్యం ఎంతో అవసరమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో "జై తెలంగాణ, జై కవితమ్మ" అంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు.
