కల్వకుర్తి సహకార సంఘం నూతన చైర్మన్గా పూరం హరీశ్వర్ రెడ్డి
- కల్వకుర్తిలో గులాబీ జెండాకు సారథి ఎవరు?..టికెట్ రేసులో దూసుకుపోతున్న గోలి శ్రీనివాస్ రెడ్డి - November 4, 2026
- కల్వకుర్తి సహకార సంఘం నూతన చైర్మన్గా పూరం హరీశ్వర్ రెడ్డి - November 4, 2026
- పలు కార్యక్రమాల్లో ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి - November 4, 2026

కల్వకుర్తి,నవంబర్ 4: కల్వకుర్తి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పాలకవర్గాన్ని ప్రభుత్వం రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నూతనంగా 13 మందితో కూడిన పాలకవర్గాన్ని నియమించగా,సంఘం చైర్మన్గా పూరం హరీశ్వర్ రెడ్డికి బాధ్యతలు అప్పగించింది.గత పాలకవర్గం నిర్వహణలో లోపాలు ఉన్నట్లు జిల్లా అధికారుల నివేదికలో పేర్కొన్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. రూ.3.53 కోట్ల బకాయిలు వసూలు కాకపోవడం,రూ.1.70 కోట్ల లెక్కలు తేలకపోవడం,ఆడిట్ అభ్యంతరాలను పరిష్కరించకపోవడం ప్రధాన కారణాలుగా వెల్లడించింది.నూతన పాలకవర్గ సభ్యులుగా పొతరపల్లి వెంకటయ్య, బండపల్లి వెంకటమ్మ, అజీమొద్దీన్, మిర్యాల శ్రీనివాస్ రెడ్డి, దామోదర్ గౌడ్, జి.భారతి, బాలు నాయక్, భూపాల్ రెడ్డి, జైపాల్ రెడ్డి, తిరుపతి రెడ్డి, శ్రీధర్ రావు, జనార్ధన్ రెడ్డి నియమితులయ్యారు. ఈ కమిటీ ఆరు నెలల పాటు కొనసాగుతుందని ప్రభుత్వ కార్యదర్శి సురేంద్ర మోహన్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
