హెల్మెట్ లేకుండా ప్రయాణం వద్దు.. మద్యం తాగి డ్రైవింగ్ చేస్తే జైలుకే!- వెల్దండ సీఐ రఘువీర్ రెడ్డి
- కల్వకుర్తిలో గులాబీ జెండాకు సారథి ఎవరు?..టికెట్ రేసులో దూసుకుపోతున్న గోలి శ్రీనివాస్ రెడ్డి - November 4, 2026
- కల్వకుర్తి సహకార సంఘం నూతన చైర్మన్గా పూరం హరీశ్వర్ రెడ్డి - November 4, 2026
- పలు కార్యక్రమాల్లో ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి - November 4, 2026

వెల్దండ,నవంబర్ 4: రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని వెల్దండ సీఐ రఘువీర్ రెడ్డి సూచించారు. బుధవారం వెల్దండ మండలం పెద్దాపూర్ గ్రామ సమీపంలోని జాతీయ రహదారి 765 పై ఆయన ఆధ్వర్యంలో పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు.ఈ సందర్భంగా ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ ప్రాముఖ్యతను వివరించారు. హెల్మెట్ ధరించడం వల్ల ప్రమాదాల సమయంలో ప్రాణాపాయం నుంచి రక్షణ పొందే అవకాశం ఉంటుందని తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే చట్టపరమైన చర్యలు తీసుకోవడంతోపాటు జైలుకు పంపే అవకాశం ఉందని హెచ్చరించారు.వాహనదారులు వేగ నియంత్రణ పాటించాలని, రహదారి భద్రతా నిబంధనలను ఉల్లంఘించవద్దని సూచించారు. ఈ తనిఖీల్లో సీఐతోపాటు ఎస్సై యుగంధర్ రెడ్డి,పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
