చంద్రకళ పార్థివదేహానికి నివాళులర్పించిన డా. విశారదన్ మహారాజ్
- కల్వకుర్తిలో గులాబీ జెండాకు సారథి ఎవరు?..టికెట్ రేసులో దూసుకుపోతున్న గోలి శ్రీనివాస్ రెడ్డి - November 4, 2026
- కల్వకుర్తి సహకార సంఘం నూతన చైర్మన్గా పూరం హరీశ్వర్ రెడ్డి - November 4, 2026
- పలు కార్యక్రమాల్లో ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి - November 4, 2026

షాద్ నగర్: కరీంనగర్ శాతవాహన విశ్వవిద్యాలయంలో ఎల్ఎల్బీ రెండో సంవత్సరం చదువుతున్న డక్కలి సామాజిక వర్గానికి చెందిన విద్యార్థిని డాకూరి చంద్రకళ ఆత్మహత్య ఘటనపై ఆమె కుటుంబానికి న్యాయం చేయాలని డా. విశారదన్ మహారాజ్ డిమాండ్ చేశారు. ఈ విషయమై గతంలో విశ్వవిద్యాలయ ఉపకులపతితో ఫోన్లో మాట్లాడి కుటుంబానికి న్యాయం చేయాలని కోరినట్లు తెలిపారు.మంగళవారం (నవంబర్ 3) షాద్నగర్లో చంద్రకళ పార్థివదేహానికి నివాళులర్పించిన ఆయన, బాధిత కుటుంబాన్ని పరామర్శించి అండగా ఉంటామని భరోసా కల్పించారు.
