పట్టభద్రులందరూ ఓటు నమోదు చేసుకోవాలి.. సర్పంచ్ కొండల్ యాదవ్
- సీపీఆర్‌తో ప్రాణాలు కాపాడవచ్చు..వెల్దండలో అవగాహన కార్యక్రమం - November 2, 2026
- మృతుల కుటుంబాలకు దశరథ్ నాయక్ ఆర్థిక సాయం - November 2, 2026
- డాన్స్ మాస్టర్ శేఖర్‌కు నాయకుల పరామర్శ.. రూ.10 వేల ఆర్థిక సాయం - November 2, 2026

వెల్దండ: అర్హులైన పట్టభద్రులందరూ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు జాబితాలో తమ పేర్లను నమోదు చేసుకోవాలని పోతేపల్లి గ్రామ సర్పంచ్ తగుళ్ల కొండల్ యాదవ్ కోరారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు ఎంతో విలువైనదని, ప్రతి అర్హుడైన పట్టభద్రుడు ఓటరు నమోదులో భాగస్వామి కావాలని సూచించారు.పోతేపల్లి గ్రామంలో నివసిస్తున్న అర్హులైన పట్టభద్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, అవసరమైన ధ్రువపత్రాలతో నిర్ణీత గడువులోపు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఓటరు జాబితాలో పేరు నమోదైతేనే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.పట్టభద్రుల ఓటరు నమోదు దరఖాస్తులకు నవంబర్ 6, 2026 చివరి తేదీ అని, గడువు ముగిసేలోపు ప్రతి ఒక్కరూ తమ పేర్లను నమోదు చేసుకోవాలని సర్పంచ్ కొండల్ యాదవ్ విజ్ఞప్తి చేశారు.
