చిన్నారుల స్నేహబంధం. ఘనంగా వినాయక చవితి వేడుకలు
- రంజిత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన రాజేందర్ రెడ్డి - September 19, 2026
- చిన్నారుల స్నేహబంధం. ఘనంగా వినాయక చవితి వేడుకలు - September 18, 2026
- 122 డివిజన్ బండ్లగూడలో గణనాథుడిని దర్శించుకున్న బీఆర్ఎస్ ఇన్చార్జ్ కార్తీక్ రెడ్డి. - September 15, 2026

గందిపేట్ : గంధంగూడ లోని కేకే టూ కాలనీ చిన్నారులు ఐకమత్యం, స్నేహభావంతో వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కాలనీలోని పిల్లలంతా ఒకే వేదికపైకి చేరి స్వామివారిని ప్రతిష్ఠించి, ప్రత్యేక పూజా కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేయడం స్థానికులను విశేషంగా ఆకట్టుకుంది ఈ ఉత్సవాల్లో తనిష్క, తనిష్క్, లవ్, యశావిని, శ్రీనిధి, ధృతిక, ఆద్య, దీక్షిత్, చర్రి, నహుష్, శశాంక్, చార్విక, నిష్రిత్, నైర్తి, తనుష్, సోముని, అభిజ్ఞ తదితర చిన్నారులు చురుగ్గా పాల్గొని ముందుండి నడిపించారు.స్ఫూర్తిదాయక సమష్టి కృషి: పిల్లల్లో భక్తి, స్నేహభావం మరియు సామాజిక బాధ్యతను పెంపొందించేలా ఈ కార్యక్రమం సాగింది.
పిల్లల ప్రతిభను, ఐకమత్యాన్ని కాలనీ పెద్దలు మనస్ఫూర్తిగా అభినందిస్తూ, భవిష్యత్తులో కూడా ఇలాంటి మరిన్ని మంచి కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షించారు.
