ఘనంగా ప్రజాపాలన దినోత్సవం
- పంట చేతికొచ్చే వేళ.. నీళ్లెక్కడ? నల్గొండకు రావాల్సిన నీటిని ఖమ్మం, ఆంధ్రాకు తరలించడం అన్యాయం.. మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య - September 19, 2026
- ఘనంగా ప్రజాపాలన దినోత్సవం - September 18, 2026
- అంబేద్కర్‌పై విమర్శలు.. రాజ్యాంగంపై దాడే మాల మహానాడు నకిరేకల్ నియోజకవర్గ అధ్యక్షుడు ముడుసు బిక్షపతి - September 17, 2026
ఘనంగా ప్రజాపాలన దినోత్సవం

జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, సెప్టెంబర్ 17 : ప్రజాపాలన దినోతవాన్ని గురువారం మండల వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. తాసీల్దార్ కార్యాలయంలో పుష్పలత, మండల పరిషత్ కార్యాలయంలో అంజన్ రెడ్డి, పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ మునుగోటి రవీందర్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారి జమున, వ్యవసాయ శాఖ కార్యాలయంలో గిరిప్రసాద్, పీఏసీఎస్ లో సీఈఓ బండ మల్లారెడ్డి, ఆయా గ్రామపంచాయతీ కార్యాలయంలో పంచాయతీల్లో సర్పంచ్ లు జెండా ఎగురవేసి జాతీయ గీతం ఆలపించారు. వేర్వేరు కార్యక్రమంలో డిప్యూటీ తాసీల్దార్ అల్బట్ ప్రాంక్లిన్, ఏఎస్ఐలు అంజయ్య, శ్రీనివాస్, ఎంపీఓ స్వరూపారాణి, సూపరింటిండెంట్ రమేష్, ఆర్ఐలు రామారావు, సత్యనారాయణ, ఏపీఓ కడెం రాంమోహన్, తదితరులు పాల్గొన్నారు.
