ఉపాధ్యాయులే సమాజ నిర్మాతలు : నకిరేకల్ మార్కెట్ కమిటీ చైర్మన్ గుత్త మంజుల మాధవరెడ్డి

1000341586.jpg

1000341585.jpg

ఉపాధ్యాయులు సమాజానికి దిక్సూచిలుగా, మార్గనిర్దేశకులుగా నిలుస్తున్నారని నకిరేకల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గుత్త మంజుల మాధవరెడ్డి అన్నారు. శుక్రవారం కట్టంగూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో నిర్వహించిన మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాల ప్రధానోత్సవ కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన 14 మంది ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులను సన్మానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉపాధ్యాయుల కృషి వల్లే సమాజంలో ఎంతోమంది ఉన్నత స్థాయికి చేరుకున్నారని పేర్కొన్నారు. ప్రపంచాన్ని పాలిస్తున్న పాలకుల సైతం ఉపాధ్యాయుల వద్దే విద్యాభ్యాసం చేశారని, సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని అన్నారు. మండల విద్యాధికారి అంబటి అంజయ్య అధ్యక్షత జరిగిన కార్యక్రమంలో మండలంలోని వివిధ ఉపాధ్యాయ సంఘాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు నిమ్మనగోటి వెంకటరమణ, చింతకాయల పుల్లయ్య, రాములు, కృష్ణ, లింగయ్య, శ్రీనివాస్, మురళయ్య, పండరి, ఎం.ఏ. గఫూర్ తదితరులు పాల్గొన్నారు.

You may also like...