పర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతి శ్రేయస్కరం – మున్సిపాలిటీ చైర్మన్ సత్య నాయక్
- నిరుద్యోగులకు శుభవార్త – సుంకిరెడ్డి జాబ్ డ్రైవ్ కు భారీ స్పందన.! - September 10, 2026
- పర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతి శ్రేయస్కరం – మున్సిపాలిటీ చైర్మన్ సత్య నాయక్ - September 10, 2026
- కరెంటు కోతలతో రైతన్న ఆగ్రహం – తాండ్ర గేట్ హైవే బ్లాక్.! - September 10, 2026
ఆమనగల్ 10: పర్యావరణాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ మట్టి వినాయక విగ్రహాలనే పూజించాలని మున్సిపల్ చైర్మన్ మీ పత్యా నాయక్ పిలుపునిచ్చారు.ఆమనగల్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో పట్టణ ప్రజలకు ఉచితంగా మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో చేసిన విగ్రహాల వల్ల చెరువుల్లోకి రసాయనాలు కలిసి కాలుష్యం పెరుగుతుందన్నారు.రసాయనాలతో చెరువులోని చిన్న జీవరాశులు చనిపోతాయని, ఆ నీటిని తాగి, ఆ నీటిలో పెరిగిన చేపలు తినడం వల్ల ప్రజలు అనారోగ్యాలకు గురవుతారని ఆయన హెచ్చరించారు. అందుకే మట్టి విగ్రహాలను వాడి పర్యావరణాన్ని కాపాడాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రాఘవేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ గీతా చారి, కౌన్సిలర్లు మొక్తాల వెంకటయ్య, అనూష శ్రీశైలం, మున్సిపల్ సిబ్బంది, వివిధ పార్టీల నాయకులు కుమార్, ధోని సురేష్, వెంకటేష్, రవి నాయక్ తదితరులు పాల్గొన్నారు.
