పేదింటి బిడ్డకు వైద్య విద్యలో సీటు – ఆదుకున్న మాదిగ యువసేన

వెల్దండ, సెప్టెంబర్ 09 :వెల్దండకు చెందిన గుద్దేటి శేఖర్ కుమార్తె గుద్దేటి సరిత నీట్ లో ప్రతిభ చాటి కామారెడ్డి ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ సీటు సాధించింది.నిరుపేద విద్యార్థినిని మాదిగ సంఘం నేతలు ఘనంగా సన్మానించారు. పై చదువుల కోసం మాదిగ యువసేన రూ.17,500, శశిపాల్ రెడ్డి ద్వారా పుష్పగిరి రావు రూ.10,000 చొప్పున మొత్తం రూ.27,500 ఆర్థిక సహాయం అందజేశారు.ఈ కార్యక్రమంలో పుల్లయ్య, పుష్పగిరి రావు, నరసింహ, కిష్టాల్, సత్యం, బాలయ్య, రామ్ భగవంతు, శివప్రసాద్, జగన్, అనిల్,రవికుమార్,ఆంజనేయులు, రాజు, ప్రశాంత్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.

You may also like...