బూడుదుల వెంకటయ్య ఇక లేరు

ఆత్మీయుడి మృతితో పొద్దటూరులో విషాదం

జ్ఞాన తెలంగాణ, శంకర్ పల్లి:పొద్దటూరు గ్రామానికి చెందిన బూడుదుల వెంకటయ్య (58), దివంగత మ్యాతరి మైసయ్య పెద్ద కుమారుడు, గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో గత వారం రోజులుగా హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం 7 గంటలకు తుదిశ్వాస విడిచారు.

వెంకటయ్య గ్రామ ప్రజలతో ఎంతో కలుపుగోలుగా, ఆప్యాయంగా, ప్రేమగా మెలిగేవారు. ఎవరిని కలిసినా చిరునవ్వుతో పలకరిస్తూ, ఆత్మీయంగా మాట్లాడేవారు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరితో స్నేహపూర్వకంగా ఉండేవారు.

గ్రామంలో ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తూ, అందరితో మంచి సంబంధాలు కొనసాగించిన వెంకటయ్య మృతి పట్ల కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, గ్రామస్థులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

వెంకటయ్య అంత్యక్రియలు ఈరోజు ఆయన స్వగ్రామమైన పొద్దటూరులో నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

You may also like...