రాజ్యాంగ నిర్మాత సాక్షిగా ప్రజా హక్కులపై వినతి.. భారత రాష్ట్ర సమితి

వెల్దండ సెప్టెంబర్ 08:వెల్దండ మండల కేంద్రంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద వెల్దండ భారత రాష్ట్ర సమితి మండల అధ్యక్షులు పుట్ట రాంరెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర ఆహార కమిషన్ అధ్యక్షులు గోలి శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుకై వినతి పత్రం సమర్పించారు.ఈ సందర్భంగా గోలి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ..రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సాక్షిగా కాంగ్రెస్ ప్రభుత్వానికి వినతి చేస్తున్నామని, 2023 ఎన్నికల్లో ఇచ్చిన 6 హామీలు 18 నెలలు గడిచినా అమలు కాలేదని మండిపడ్డారు. హామీలు వెంటనే అమలు చేయకపోతే భారత రాష్ట్ర సమితి పార్టీ ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ విజితా రెడ్డి, మాజీ ఉప ఎంపీపీ అనిల్ కుమార్, పార్టీ మాజీ అధ్యక్షులు జోగయ్య, నిరంజన్, లింగం, చలిచీమల నిరంజన్, మొక్తాల శేఖర్, నాగులు నాయక్, రాజు నాయక్, దశరథం, తిరుమల్ రావు, చంద్రశేఖర్, ఆనంద్, ప్రసాద్, ప్రవీణ్ తదితర పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

You may also like...