కడ్తాల్ లో ఘనంగా బోనాలు ఉత్సవాలు.. ముఖ్య అతిథిగా పాల్గొన్న విజితా రెడ్డి
- అర్హులందరికీ రేషన్ కార్డులు అందిస్తాం.. తహసిల్దార్ కార్తీక్ కుమార్ - September 8, 2026
- పోచమ్మ బోనాలు విజయవంతం చేయండి.. సర్పంచ్ ప్రసాద్ గౌడ్ - September 8, 2026
- దళిత స్పీకర్ ను అవమానించిన తాత మధు పై చర్యలు తీసుకోవాలి.. పుల్లయ్య - September 8, 2026
కడ్తాల్, సెప్టెంబర్ 7:రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండల కేంద్రంలో బోనాల ఉత్సవాలను ఆదివారం ఘనంగా నిర్వహించారు.ఈ ఉత్సవాలకు ముఖ్య అతిథిగా తెలంగాణ ఉద్యమకారురాలు, మార్కెట్ కమిటీ మాజీ చైర్ పర్సన్,వెల్దండ మాజీ జెడ్పీటీసీ విజితా రెడ్డిహాజరయ్యారు. ఆమె బోనం ఎత్తుకొని అమ్మవారికి మొక్కులు చెల్లించారు.గ్రామంలోని అమ్మవారి ఆలయం నుంచి ప్రారంభమైన బోనాల ఊరేగింపు ప్రధాన వీధుల మీదుగా కోలాహలంగా సాగింది. మహిళలు పెద్ద ఎత్తున బోనాలతో పాల్గొన్నారు.అనంతరం ఆమె మాట్లాడుతూ..బోనాల పండుగ తెలంగాణ సంస్కృతికి ప్రతీక అని,అమ్మవారి ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, మహిళా సంఘాల సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
