బల్మూర్ మండలంలో బీజేవైఎం నాయకుల ముందస్తు అరెస్ట్.!
- ఉప్పల వెంకటేష్ పిలుపుతో బండోనిపల్లిలో కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు - September 7, 2026
- కల్వకుర్తిలో కాంగ్రెస్ పార్టీకి పెరుగుతున్న ప్రజాదారణ - September 7, 2026
- మృతురాలి కుటుంబానికి భాస్కరరావు ఆర్థిక సహాయం - September 7, 2026
బల్మూర్ సెప్టెంబర్ 07: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని బల్మూర్ మండల కేంద్రంలో సోమవారం శాంతియుతంగా ధర్నాకు సిద్ధమవుతున్న బీజేపీ మరియు బీజేవైఎం ముఖ్య నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు.ప్రభుత్వ నిరంకుశ వైఖరికి, పోలీసుల అక్రమ అరెస్టులకు వ్యతిరేకంగా నాయకులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. విద్యార్థుల హక్కుల కోసం పోరాడుతుంటే అక్రమంగా నిర్బంధించడం ప్రజాస్వామ్య విరుద్ధమని మండిపడ్డారు.
అరెస్టయిన ముఖ్య నాయకులలో బాలస్వామి యాదవ్, బల్మూర్ మండల బీజేపీ అధ్యక్షులు రమేష్,ఆంజనేయులు, సైదులు యాదవ్, ఈనాం స్వర్ణ, అజయ్, మల్లేష్,వార్డ్ నెంబర్ బాధ్యులు చంద్రశేఖర్ పాల్గొని ప్రసంగించారు.విద్యార్థులకు న్యాయం జరిగే వరకు మరియు బకాయిల నిధులు పూర్తిగా విడుదల చేసేంత వరకు బీజేపీ, బీజేవైఎం ఆధ్వర్యంలో ఈ పోరాటం ఆగేది లేదని నాయకులు స్పష్టం చేశారు.
