బ్రిడ్జిపై గుంత.. అధికారుల నిర్లక్ష్యం!
దేవరుప్పుల మండల కేంద్రంలోని వాగుపై ఉన్న మెయిన్ బ్రిడ్జి మొదటి భాగంలో ఏర్పడిన గుంత ప్రమాదకరంగా మారుతోంది. గుంత ఏర్పడి చాలా నెలలు గడుస్తున్నా అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడం పట్ల స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిత్యం వాహనాలు, ప్రయాణికులు రాకపోకలు సాగించే ఈ మార్గంలో గుంత కారణంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. ప్రజల భద్రత, ప్రయాణ సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని అధికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి బ్రిడ్జిపై ఉన్న గుంతను పూడ్చి మరమ్మతులు చేపట్టాలని స్థానికులు…
