ఆపదలో ఉన్న మిత్రుడికి ఆర్థీక చేయూత
- సాయి నగర్లో భక్తిశ్రద్ధలతో గణనాథుడి పూజలు - September 19, 2026
- చౌడర్గూడలో TOSS ప్రవేశాల ప్రచారం - September 19, 2026
- హెచ్-1బీపై 1 లక్ష డాలర్ల ఫీజు కొనసాగింపు - September 19, 2026

ఆపదలో ఉన్న మిత్రుడికి ఆర్థీక చేయూత
స్నేహ బంధాన్ని చాటుకున్న టెన్త్ బ్యాచ్

జ్ఞాన తెలంగాణ, కల్వకుర్తి నియోజకవర్గ ప్రతినిధి ఆగస్టు 03 :
కల్వకుర్తి నియోజకవర్గం లోని వెల్దండ మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన 1998-99 సంవత్సరంలో కలిసి చదువుకున్న పూర్వ విద్యార్థులు గొప్ప మనసు చాటుకున్నారు. మండల పరిధిలోని రాచూర్ గ్రామానికి చెందిన కోవూరి వినోద్ ఇటీవల అనారోగ్యానికి గురై మహబూబ్ నగర్ లోని ఓ ప్రైవేట్ హాస్పటల్ లో చికిత్స పొంది ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో కష్టాల్లో ఉన్నాడని తెలుసుకున్న స్నేహితులు సోమవారం తక్షణ ఆసుపత్రి ఖర్చులకు గాను రూ. 37 వేల రూపాయలను అందజేసి అండగా నిలిచారు. సంతోషంలోనే కాదు కష్టాల్లోనూ తోడుగా ఉండేది స్నేహం మాత్రమే అని నిరూపించారు. ఈ కార్యక్రమంలో బిక్కుమాండ్ల శ్రీనివాస్, రాకేష్, శేఖర్, మల్లికార్జున్, విజయ చారి, శంకర్ తదితరులు ఉన్నారు.
