Author: MALLEPAKULA JANGAIAH
నాగర్ కర్నూల్ జిల్లా / చారకొండ:నాగర్ కర్నూల్ జిల్లా, చారకొండ మండలం, ఎర్రవల్లి గ్రామంలో డిండి రిజర్వాయర్ కు అనుసంధానంగా నిర్మిస్తున్న ఎర్రవల్లి రిజర్వాయర్ కోసం భూములు కోల్పోయిన నిర్వాసితుల నిరవధిక దీక్షలు నేటితో 293 రోజులకు చేరాయి.పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా ఎర్రవల్లి రిజర్వాయర్ ఏర్పాటు కోసం తమ సారవంతమైన భూములను కోల్పోయామని, ప్రభుత్వం ఇప్పటివరకు సరైన పరిహారం, పునరావాస ప్యాకేజీ కల్పించలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.గత 293 రోజులుగా గ్రామంలో…
కల్వకుర్తి రెవెన్యూ డివిజన్ సాధన ఉద్యమ సమయంలో నాటి BRS ప్రభుత్వం అక్రమంగా నమోదు చేసిన కేసులో భాగంగా మాజీ ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి గారు రేపు కల్వకుర్తి కోర్టుకు హాజరు కానున్నారు.రేపు ఉదయం 11 గంటలకు కల్వకుర్తి కోర్టులో ఆయన హాజరు కానున్నట్లు వెల్డండ యువజన కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షులు కడారి శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.కల్వకుర్తిని రెవెన్యూ డివిజన్ చేయాలని జరిగిన ఉద్యమంలో పాల్గొన్న నాయకులపై అప్పటి ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించిందని, ఆ…
వెల్దండ మండలం పోతేపల్లిలో ఇటీవల మృతి చెందిన ముంత శ్రీను కుటుంబానికి ప్రభుత్వం మంజూరు చేసిన జాతీయ కుటుంబ ప్రయోజన పథకం (NFBS) కింద రూ.20 వేల చెక్కును గ్రామ సర్పంచ్ తగుల్ల కొండలు యాదవ్ అందజేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులంతా సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, యువ నాయకులు ముంత మల్లేష్, ఉడుత శివ, చిన్న సైదయ్య, ఎగిరిశెట్టి శివ, ఉడుత బాలు, సాయిబాబా తదితరులు పాల్గొన్నారు.
వెల్దండ మండలం నగరగడ్డ తండాలో శ్రీ మేరాముడి నూతన మందిర నిర్మాణానికి వెల్దండ సింగిల్ విండో చైర్మన్ జూపల్లి భాస్కర్ రావు రూ. 51,000 విరాళం అందజేశారు.ఆలయ నిర్మాణ వివరాలను తండా నాయకులను అడిగి తెలుసుకున్న ఆయన, తన వంతుగా ఈ విరాళాన్ని అందించారు. ఆలయ అభివృద్ధికి సహాయం చేయడం సంతోషంగా ఉందని, అమ్మవారి ఆశీస్సులు ప్రజలపై ఉండాలని ఆయన అన్నారు. తండా నాయకులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.
వెల్దండ: వెల్దండ మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు హరికిషన్ నాయక్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఘనపయ్యకు పూజలు చేసిన వార్డు సభ్యులు మసిగుoడ్ల వెంకటేష్ , సేవాదళ్ జిల్లా ఉపాధ్యక్షులు పుల్లయ్య .అనంతరం ఏర్పాటు చేసిన అన్నదానం కార్యక్రమం ప్రారంభించిన కాంగ్రెస్ పార్టీ డిసిసి ఉపాధ్యక్షులు ఎన్నo భూపతిరెడ్డి, ప్రధాన కార్యదర్శి మోతిలాల్ నాయక్ , వెల్దండ గ్రామ సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్ ,కిషన్ సెల్ తాలూకా అధ్యక్షులు పర్వ…
వెల్దండ: మండలంలోని చౌదర్ పల్లి గ్రామంలో గణేష్ ఉత్సవ కమిటీకి సింగిల్ విండో చైర్మన్ భాస్కర్ రావు రూ.25 వేల ఆర్థిక సాయం అందజేశారు.వినాయక చవితి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు గ్రామ యువకులు ముందుకు వచ్చారు. ఈ నేపథ్యంలో వారికి అండగా నిలుస్తూ భాస్కర్ రావు ఈ ఆర్థిక సహాయాన్ని అందించారు. డీజే సౌండ్ బాక్సుల ఏర్పాటుకు, ఇతర ఏర్పాట్లకు ఈ నగదును వినియోగించుకోవాలని ఆయన సూచించారు.ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు చైర్మన్ కు కృతజ్ఞతలు…
కల్వకుర్తి మండలం తాండ్ర గ్రామానికి చెందిన గోలి సుదర్శన్ రెడ్డికి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి కీలక పదవి బాధ్యతలు అప్పగించారు.రెవెన్యూ డివిజనల్ స్థాయి అగ్రికల్చరల్ టెక్నాలజీ మేనేజ్మెంట్ ఏజెన్సీ (ATMA) చైర్మన్ గా సుదర్శన్ రెడ్డి నియమితులయ్యారు. ఈ సందర్భంగా సుదర్శన్ రెడ్డి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ వ్యవసాయ అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు.తాండ్ర సుదర్శన్ రెడ్డికి కీలక పదవి
వెల్దండ మండలంలోని పోతేపల్లి గ్రామంలో ఇటీవల నూనె కృష్ణయ్య మృతి చెందడంతో వారి కుటుంబాలకు ప్రభుత్వం నేషనల్ ఫ్యామిలీ బేనిఫీట్ స్కీమ్ ( NFBS ) కింద మంజూరు చేసిన రూ. 2 వేల ఆర్థిక సహాయానికి సంబంధించిన చెక్కును మంగళవారం కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ కొండల్ యాదవ్ మాట్లాడుతూ ప్రస్తుతం అందిస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి కుటుంబం సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.అవసరమైన వారికి ప్రభుత్వ పథకాల ద్వారా ఆర్థిక భరోసా…
బీసీ కుల గణన చేస్తామని మాట ఇచ్చిన ప్రధాని మోదీ, ఆ తర్వాత బీసీలను వంచించారనీ బీసీ పొలిటికల్ జేఏసీ జిల్లా అద్యక్షులు దన్నోజు అరవింద్ చారి విమర్శించారు. నాగర్కర్నూల్ లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో బిజెపికి తగిన గుణపాఠం చెబుతామన్నారు. గత 12సంవత్సరాలుగా బీసీలకు మోసం చేస్తూ ఉన్నత వర్గాలకు ప్రాధాన్యత ఇస్తున్నారని మండిపడ్డారు..
*మృతునికుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయం అందజేత సర్పంచ్ మట్ట యాదమ్మ మట్ట వెంకటయ్య గౌడ్*వెల్దండ సెప్టెంబర్ 16 వెల్దండ మండల కేంద్రానికి చెందిన మాడుగుల సత్తయ్య అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలుసుకున్న సర్పంచ్ మట్ట యాదమ్మ మట్ట వెంకటయ్య గౌడ్ మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి అధైర్య పడకుండా ధైర్యంగా ఉండాలని భరోసా కల్పించారు అనంతరం మృతుని కుటుంబ సభ్యులకు సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్ 5000 వేల…