Author: MALLEPAKULA JANGAIAH
నాగర్‌కర్నూల్: అత్యవసరంగా O Negative రక్తం అవసరమని Youth Red Cross – నాగర్‌కర్నూల్ జిల్లా కన్వీనర్ దామగట్ల కుమార్ ఇచ్చిన పిలుపుకు 10 నిమిషాల్లోనే స్పందన లభించింది.ట్రాఫిక్ కానిస్టేబుల్ శ్రీనివాసు, టిఫిన్ సెంటర్ నిర్వాహకుడు చంద్రశేఖర్ వెంటనే బ్లడ్ బ్యాంక్‌కు చేరుకుని రక్తదానం చేశారు. దీంతో అవసరమైన 2 యూనిట్ల O- రక్తం సమకూరింది.అత్యవసర సమయంలో ముందుకు వచ్చిన ఇద్దరు దాతలను కన్వీనర్ దామగట్ల కుమార్ అభినందించారు.
వెల్దండ మండల రైతు వేదికలో ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి రైతులకు రాయితీ వేరుశనగ విత్తనాలను పంపిణీ చేశారు. జాతీయ తినదగిన నూనెగింజల మిషన్ (National Mission on Oil Seeds) లో భాగంగా ఈ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.అనంతరం ఇటీవల ఆత్మ కమిటీ చైర్మన్‌గా ఎన్నికైన గోరి సుదర్శన్ రెడ్డిని ఎమ్మెల్యే శాలువాతో ఘనంగా సన్మానించారు.అదేవిధంగా వెల్దండ గ్రామ పంచాయతీ కార్యాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎస్ కేంద్రాన్ని (S Kendra) ఎమ్మెల్యే ప్రారంభించారు.ఈ కార్యక్రమాల్లో…
కల్వకుర్తి పట్టణంలో ప్రసిద్ధి చెందిన వేప చెట్టు గణేషుడు (నింబ వినాయకుడు) సన్నిధిలో భక్తి పరవశం నెలకొంది. వేప చెట్టు చెంత కొలువైన విఘ్నేశ్వరుడిని దర్శించుకుని భక్తులు ఆధ్యాత్మిక అనుభూతి పొందుతున్నారు.ఇందులో భాగంగా కల్వకుర్తి మాజీ శాసనసభ్యులు, ఎఐసిసి జాతీయ ఇన్చార్జ్ శ్రీ చల్లా వంశీచంద్ రెడ్డి గారు ఈరోజు వేప చెట్టు గణపతిని దర్శించుకున్నారు. సీడబ్ల్యూఎస్సీ ప్రత్యేక ఆహ్వానితులుగా ఉన్న చల్లా వంశీచంద్ రెడ్డి గారికి ఆలయ నిర్వాహకులు, స్థానిక నాయకులు ఘనంగా స్వాగతం పలికి…
తెల్కపల్లి: తెల్కపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (PACS) కార్యాలయంలో ఈ రోజు నిర్వహించిన ఉచిత వేరుశెనగ విత్తన పంపిణీ కార్యక్రమంలో నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే డా. కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, రైతులకు సకాలంలో విత్తనాలు, ఎరువులు అందేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ సింగిల్ విండో చైర్మన్ భాస్కర్ రెడ్డి గారు, వైస్ చైర్మన్…
కార్యకర్తల ఐక్యతే పార్టీకి బలమని, సమిష్టి కృషే కాంగ్రెస్ విజయానికి పునాది అని కాంగ్రెస్ నాయకులు వంశీచంద్ రెడ్డి అన్నారు.ఆమనగల్ మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ఆయన సందర్శించారు. ఇటీవల నూతనంగా నియమితులైన ఆమనగల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ కసిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి మరియు పట్టణ అధ్యక్షులు శ్రీ శివలింగం లను మర్యాదపూర్వకంగా కలిసి అభినందించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయాలని, కార్యకర్తలందరినీ సమన్వయం చేసుకుంటూ ప్రజలకు…
ఆమనగల్లు, రంగారెడ్డి జిల్లా (21/09/2026):- వినాయక చవితి సందర్భంగా ఆమనగల్లు పట్టణంలో బుద్ధినాథ్ వినాయక ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుడికి తెలంగాణ ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు.నియోజకవర్గ ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించారు. అనంతరం నిర్వాహకులు ఆయనను శాలువాతో సత్కరించారు.ఈ కార్యక్రమంలో BRS నాయకులు, ఉత్సవ నిర్వాహకులు సతీష్, కిరణ్, బుజ్జి తదితరులు, భక్తులు పాల్గొన్నారు.
కల్వకుర్తి: కల్వకుర్తి రెవెన్యూ డివిజన్ సాధన కోసం 2016లో చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు సంబంధించిన కేసులో కాంగ్రెస్ నేత వంశీచంద్ రెడ్డి నేడు కల్వకుర్తి జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన సోషల్ మీడియాలో స్పందిస్తూ "కల్వకుర్తి గడ్డ నన్ను ఎంతగా మలిచిందో… ఆ గడ్డ కోసం నిలబడే నా సంకల్పం అంతే బలంగా ఉంటుంది" అని పేర్కొన్నారు."2016లో కల్వకుర్తి రెవెన్యూ డివిజన్ సాధన కోసం ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన నన్ను,…
నాగర్ కర్నూల్: జిల్లాలో పదో తరగతి చదువుతున్న విద్యార్థుల పేర్ల సవరణకు అవకాశం కల్పించినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ) రమేష్ కుమార్ ఆదివారం తెలిపారు.జిల్లాలోని అన్ని యాజమాన్యాల పాఠశాలల్లో 10వ తరగతి చదువుతున్న విద్యార్థుల పేర్లలో, వారి తల్లిదండ్రుల పేర్లలో ఉన్న స్పెల్లింగ్ తప్పులను సరిచేసుకునేందుకు అవకాశం ఇస్తున్నామని ఆయన పేర్కొన్నారు.ఈ మేరకు అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తమ పాఠశాలల విద్యార్థుల వివరాలను పరిశీలించి, స్పెల్లింగ్ మిస్టేక్ లు ఉంటే వెంటనే సరిచేసి యుడైస్ (UDISE)…
కల్వకుర్తి / వెల్దండ, సెప్టెంబర్ 20:గౌరవ కల్వకుర్తి శాసనసభ్యులు శ్రీ కసిరెడ్డి నారాయణ రెడ్డి గారి చేతుల మీదుగా రేపు అనగా తేదీ 21-09-2026 న వేరుశనగ విత్తనాల పంపిణీ కార్యక్రమం నిర్వహించనున్నారు.ఈ కార్యక్రమంలో భాగంగా ..ఉదయం 10:30 గంటలకు – వెల్దండ మండల కేంద్రంలోని రైతు వేదికలో మరియు….ఉదయం 11:30 గంటలకు – కల్వకుర్తి పట్టణంలోని రైతు వేదికలో వేరుశనగ విత్తనాల పంపిణీ జరగనుంది.కావున సంబంధిత మండలాల ముఖ్య నాయకులు, ప్రజా ప్రతినిధులు, మండల అధికారులు…
కల్వకుర్తి: ప్రధానమంత్రి ఆవాస్ యోజన – గ్రామీణ్ (PMAY-G) పథకం కింద 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను తెలంగాణ రాష్ట్రానికి 2 లక్షల ఇళ్లను మంజూరు చేసిన కేంద్ర ప్రభుత్వానికి, భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు BJYM అసెంబ్లీ కన్వీనర్, తలకొండపల్లి మాజీ ఉప సర్పంచ్ పద్మ అనిల్ ముదిరాజ్ తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో సొంత ఇల్లు లేని అర్హులైన పేద కుటుంబాలకు పక్కా ఇళ్ల…