ఆటో డ్రైవర్లకు న్యాయం చేస్తాం: మంత్రి పొన్నం ప్రభాకర్.
- నిషేధిత భూమి రిజిస్ట్రేషన్.. సబ్ రిజిస్ట్రార్ అరెస్టు - September 6, 2026
- క్రిష్ణగిరి పాదాల గుట్టకు తిరిగి పూర్వ వైభవం - September 5, 2026
- శంకర్పల్లి మున్సిపాలిటీలో జోరు అందుకున్న అండర్ డ్రైనేజీ పనులు - September 5, 2026

ఆటో డ్రైవర్లకు న్యాయం చేస్తాం: మంత్రి పొన్నం ప్రభాకర్.
హైదరాబాద్ డిసెంబర్ 19:ప్రజాభవన్‌లో నిర్వహించిన ప్రజావాణి కి మంచి స్పందన వచ్చిందని రవాణా బీసీ సంక్షేమ శాక మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మీడియా పాయిం ట్‌లో వివరాలను వెల్ల డించారు. మంగళవారం 5,126 దరఖాస్తులు వచ్చాయ తెలిపారు అందులో ఎక్కువ అప్లి కేషన్లు డబుల్ బెడ్ రూం ఇండ్ల కోసం వచ్చాయని పేర్కొన్నారు.
నిరుద్యోగులు కూడా ఎక్కు వ సంఖ్యలో వచ్చారని తెలిపారు. వాళ్ల సమస్యలు ఖచ్చితంగా పరిష్కారం చేస్తామని స్పష్టం చేశారు.మహిళలకు ఇచ్చిన హామీ ప్రకారం ఫ్రీ బస్ అమలు చేస్తున్నాం బస్సుల్లో ఉచిత ప్రయాణం వల్ల ఆటో వాళ్లు ఇబ్బంది పడుతున్నారని.. ఆ విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు.ఆటో వాళ్లు తమ సోదరులే అని వాళ్లకు ఖచ్చితంగా న్యాయం చేస్తామన్నారు సమస్య పరిష్కరించేవరకు ఓపికగా ఉండాలని మంత్రి కోరారు.
