గుండ్లపోచంపల్లిలో గంజాయి కలకలం: 3.32 కిలోల డ్రగ్స్ స్వాధీనం, ముగ్గురు అరెస్ట్

384061.jpg

మేడ్చల్: గుండ్లపోచంపల్లిలోని మాలిక్ కాక్‌ఫైర్ పబ్ సమీపంలో గంజాయి విక్రయిస్తున్నట్లు అందిన నమ్మదగిన సమాచారంతో ఎక్సైజ్ రాష్ట్ర టాస్క్‌ఫోర్స్ టీమ్-ఎ తనిఖీలు చేపట్టింది. సి.ఐ రమేష్ మరియు వారి సిబ్బంది జరిపిన ఈ దాడిలో 3.323 కిలోల బరువున్న మూడు గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు.

ఈ కేసుకు సంబంధించి షేక్ ముక్తార్ (21), మహమ్మద్ గౌసోద్దీన్ (24), బుయ్య శుభమ్ (21) అనే ముగ్గురు వ్యక్తులను అధికారులు అరెస్ట్ చేశారు. నిందితులను, స్వాధీనం చేసుకున్న గంజాయిని తదుపరి చర్యల కోసం మేడ్చల్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్‌కు అప్పగించినట్లు సి.ఐ రమేష్ తెలిపారు.

You may also like...