డాన్స్ మాస్టర్ శేఖర్‌కు నాయకుల పరామర్శ.. రూ.10 వేల ఆర్థిక సాయం
- సీపీఆర్‌తో ప్రాణాలు కాపాడవచ్చు..వెల్దండలో అవగాహన కార్యక్రమం - November 2, 2026
- మృతుల కుటుంబాలకు దశరథ్ నాయక్ ఆర్థిక సాయం - November 2, 2026
- డాన్స్ మాస్టర్ శేఖర్‌కు నాయకుల పరామర్శ.. రూ.10 వేల ఆర్థిక సాయం - November 2, 2026

వెల్దండ అక్టోబర్ 31 : రోడ్డు ప్రమాదంలో కాలు ఫ్రాక్చర్ అయి చికిత్స పొందుతున్న పట్టణంలోని ఇందిరానగర్‌కు చెందిన జర్నలిస్టు,డాన్స్ మాస్టర్ ఏదుల శేఖర్‌ను పలువురు నాయకులు శనివారం పరామర్శించారు. మాజీ మంత్రి చిత్తరంజన్ దాస్, మాజీ సర్పంచ్ ఆనంద్ కుమార్, కౌన్సిలర్ రామరాజుతో కలిసి ఆయన నివాసానికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ఈ సందర్భంగా చిత్తరంజన్ దాస్ రూ.5 వేలు, ఆనంద్ కుమార్ రూ.5 వేల ఆర్థిక సాయం అందజేసి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. శేఖర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కౌన్సిలర్ రాజేష్ కుమార్,శ్రీకాంత్ రెడ్డి, సంతు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
