సీపీఆర్‌తో ప్రాణాలు కాపాడవచ్చు..వెల్దండలో అవగాహన కార్యక్రమం
- సీపీఆర్‌తో ప్రాణాలు కాపాడవచ్చు..వెల్దండలో అవగాహన కార్యక్రమం - November 2, 2026
- మృతుల కుటుంబాలకు దశరథ్ నాయక్ ఆర్థిక సాయం - November 2, 2026
- డాన్స్ మాస్టర్ శేఖర్‌కు నాయకుల పరామర్శ.. రూ.10 వేల ఆర్థిక సాయం - November 2, 2026

వెల్దండ అక్టోబర్ 31: వెల్దండ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శనివారం వైద్యురాలు డాక్టర్ సింధు ఆధ్వర్యంలో సీపీఆర్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా యోగా శిక్షకులు బీరయ్య సీపీఆర్ చేసే విధానాన్ని ప్రదర్శించి అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ..గుండెపోటు లేదా గుండె ఆగిపోయిన పరిస్థితుల్లో బాధితుడికి వెంటనే సీపీఆర్ చేయడం ద్వారా ప్రాణాలు కాపాడే అవకాశం ఉంటుందని తెలిపారు.అత్యవసర సమయంలో అంబులెన్స్ వచ్చేలోపు సరైన పద్ధతిలో ఛాతీపై ఒత్తిడి ఇవ్వడం ఎంతో కీలకమని వివరించారు.ప్రతి ఒక్కరూ సీపీఆర్‌పై ప్రాథమిక అవగాహన కలిగి ఉండాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సిబ్బంది సూర్యకళ, ఏఎన్ఎం జహంగీర్ బీ, ఆశా కార్యకర్తలు, రోగులు తదితరులు పాల్గొన్నారు.
