తమ్ముడిని కత్తితో పొడిచి చంపిన అన్న
- తమ్ముడిని కత్తితో పొడిచి చంపిన అన్న - September 20, 2026
- సాయి నగర్లో భక్తిశ్రద్ధలతో గణనాథుడి పూజలు - September 19, 2026
- చౌడర్‌గూడలో TOSS ప్రవేశాల ప్రచారం - September 19, 2026

వరంగల్:16వ డివిజన్ పరిధిలోని గరీబ్ నగర్లో దారుణ ఘటన చోటుచేసుకుంది. సొంత తమ్ముడిని అన్నే కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు. గరీబ్ నగర్‌కు చెందిన ప్రవీణ్, ప్రసాద్ ఇద్దరు అన్నదమ్ముల మధ్య గొడవ. ఆవేశానికి లోనైన అన్న ప్రవీణ్, తమ్ముడు ప్రసాద్‌పై కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి తీవ్రంగా పొడిచాడు. తీవ్ర గాయాలపాలైన ప్రసాద్ ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితుడు ప్రవీణ్‌ను అదుపులోకి తీసుకుని విచారణ వేగవంతం చేశారు.
