సీఎంఆర్ఎఫ్ నిరుపేదలకు వరం – మార్కెట్ డైరెక్టర్ రాజశేఖర్

వెల్దండ 13: పేద ప్రజలకు సీఎంఆర్ఎఫ్ పథకం పెద్ద అండగా ఉందని కల్వకుర్తి మార్కెట్ కమిటీ డైరెక్టర్ చెర్కు రాజశేఖర్ అన్నారు.వెల్దండ మండలం చెర్కూర్ గ్రామానికి చెందిన బొల్లంపల్లి మౌనికకు ప్రభుత్వం మంజూరు చేసిన రూ. 21 వేల సీఎంఆర్ఎఫ్ చెక్కును ఆమె కుటుంబానికి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న పేదలకు ఈ పథకం ఎంతో మేలు చేస్తోందని తెలిపారు.అలాగే చెర్కూర్ గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మరణించిన దాసరి బాలయ్య కుటుంబాన్ని కాంగ్రెస్ నేతలు పరామర్శించారు. బాలయ్య భార్య పెంటమ్మకు రూ. 20 వేల ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

You may also like...