సెప్టెంబర్ 17ను విమోచన దినోత్సవంగా ప్రకటించాలని వినతి
- కాంగ్రెస్ తీరుపై చిరుమర్తి లింగయ్య ధ్వజం - September 11, 2026
- మంచినీటి సమస్యల తలెత్తకుండా చర్యలు : సర్పంచ్ ముక్కామల శ్యామల - September 11, 2026
- కట్టంగూర్ ఎంఈఓగా మైనం శ్రీలత బాధ్యతల స్వీకరణ - September 11, 2026
సెప్టెంబర్ 17ను విమోచన దినోత్సవంగా ప్రకటించాలని వినతి
జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, సెప్టెంబర్ 11 : అధికారికంగా సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా నిర్వహించాలని శుక్రవారం బీజేపీ నాయకులు తాసీల్దార్ పుష్పలతకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మండల వెంకన్న మాట్లాడుతూ తెలంగాణ విమోచన చరిత్రను భవిష్యత్ తరాలకు అందించేందుకు తెలంగాణ సప్త సంకల్పాలు అమలు చేయాలని కోరారు. కార్యక్రమంలో బీజేపీ దివ్యాంగుల విభాగం రాష్ట్ర కో కన్వీనర్ గోలి ప్రభాకర్, జిల్లా కార్యదర్శి పబ్బు వెంకన్న, మండల అధ్యక్షులు నీలం నాగరాజు, జిల్లా కార్యవర్గ సభ్యులు నూకల సుధాకర్రెడ్డి, నాయకులు పాదూరి వెంకట్ రెడ్డి, కోమటి నర్సింహ్మ, పులకరం శంకర్, ముడుసు భిక్షపతి, ఓరుగంటి హరిబాబు, బొడ్డుపల్లి అంజనేయులు, చెరుకు నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
