మంచినీటి సమస్యల తలెత్తకుండా చర్యలు : సర్పంచ్ ముక్కామల శ్యామల

కట్టంగూర్, సెప్టెంబర్ 10 : మండల కేంద్రంలో ప్రజలు మంచినీటి కోసం ఇబ్బందులు పకకుండా అన్ని చర్యలు తీసుకంటున్నామని సర్పంచ్ ముక్కామల శ్యామల శేఖర్ అన్నారు. మండల కేంద్రంలోని చెరువు కట్ట నుంచి కోటమైసమ్మ బజారు వరకు రూ.2.50లక్షల నిధులతో చేపట్టనున్న నూతన పైప్ లైన్ నిర్మాణానికి గురువారం ఆమె పాలకవర్గ సభ్యులతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ గుండు రాంబాబు, వార్డు సభ్యులు ఏకుల సుజాత, ఏనుగు సైదులు, అయితగోని సైదులు, శ్రీరామ సంధ్య, యర్కల శశి, పులకరం శ్రీను, మైనం ఉమా, అయితగోని సైదమ్మ, సీనియర్ కాంగ్రెస్ నాయకులు మేడి ఇద్దయ్య, మాజీ ఉప సర్పంచ్ అంతటి శ్రీను, మేడి విజయ్ తదితరులు పాల్గొన్నారు.1000340325.jpg

You may also like...